రిమ్స్ కేసును సుమోటోగా స్వీక‌రించిన మాన‌వ హ‌క్కుల సంఘం

క‌లం, వెబ్‌డెస్క్‌: ఆదిలాబాద్‌లోని రిమ్స్ (Adilabad RIMS) ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ (SNCU) వార్డులో సోమవారం అర్ధరాత్రి జరిగిన షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ మరో 20 మందికి పైగా చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటనపై స్పందించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (Telangana HRC) ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.

ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యల గురించి ఆరా తీసింది. ప్ర‌మాదం జ‌రిగిన‌ వార్డులోని విద్యుత్ వ్యవస్థ, ఫైర్ అలారం, భద్రతా ఏర్పాట్లు, మెయింటెనెన్స్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (Telangana HRC) ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.

Also Read : సర్‌పై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు?.. ఈసీ వివరణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>