కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఎదుట మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విలాస్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
గత ఆగస్టు నెల వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన రెండు నెలల వేతనాలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా రమేష్తో పాటు రాజేందర్, సాయి, పోశెట్టి, సరస్వతి, భాగ్యలక్ష్మి, సంగీత తదితరులు పాల్గొన్నారు.

