ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. దిగువ ప్రాంత ప్రజలకు అలర్ట్!

కలం, ​రామగుండం: గణేష్ నిమజ్జన కార్యక్రమాలను పురస్కరించుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ (Sripada Yellampally Project) నుండి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు రామగుండం ఈఈ (విభాగం నం. 7) పి. రవీంద్ర చారీ తెలిపారు. ప్రాజెక్ట్ నీటి విడుదలతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, దిగువ ప్రాంత ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గోదావరి ప్రవాహంలోకి వెళ్లొద్దు..

​ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు దిగువన గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, పల్లెకారులు నదీ ప్రవాహంలోకి గానీ, నది ఒడ్డుకు గానీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ​గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు సూచించిన నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయాలని కోరారు. రక్షణ చర్యల్లో భాగంగా పోలీస్, రెవెన్యూ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యపరచాలని, ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ప్రాజెక్టు అధికారుల సూచనలకు సహకరించాలని ఈఈ రవీంద్ర చారి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>