కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 23, 24 న సెలవులు (School Holidays) ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. వాతావరణ శాఖ జారీ చేసిన తీవ్ర హెచ్చరికలు, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థుల సురక్షితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
వర్షాల ఉధృతి కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఎదురుకాకుండా తగిన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సంబంధిత ఆర్సీఓలను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా వర్షభయం పొంచి ఉన్నందున అధికారులు, సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ ఉత్తర్వులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలలకు (School Holidays) వర్తిస్తాయని, అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
Also Read : ముగిసిన భేటీ.. నీటి విడుదలకు కర్ణాటక సీఎం కీలక హామీ
Follow Us On: X(Twitter)

