జూరాల నీటి విడుదలకు మంత్రి శ్రీహరి ఆదేశం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన జూరాల ప్రాజెక్ట్ నీటి విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతుల సాగునీటి అవసరాలపై జూరాల నీటి విడుదలకు మంత్రి వాకిటి శ్రీహరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం  చర్యలు తీసుకువడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అటు జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి మరోసారి భేటీ కానున్నారు.  ఉమ్మడి పాలమూరు జిల్లాకు నీటిని విడుదల చేయాలని మంగళవారం కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కు మంత్రుల బృందం వినతి పత్రం సమర్పించారు. దీంతో బుధవారం జరిగే భేటీలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>