నేను వచ్చాకే అమెరికాకు స్వర్ణ యుగం: ట్రంప్

కలం, వెబ్ డెస్క్: తాను అధ్యక్షుడయ్యాకే అమెరికా(America)కు స్వర్ణ యుగం ప్రారంభమైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసించుకున్నారు. తమ ఆధ్వర్యంలో అమెరికాను శక్తివంతమైన దేశంగా చేశామన్నారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగులో ట్రంప్ ప్రసంగించారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అసెంబ్లీలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ మిలటరీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందన్నారు. తమ టెక్నాలజీని సాటి లేనిది ఏదీ లేదన్నారు. వేరే వాళ్లు శాంతి గురించి మాట్లాడుతుంటే.. అమెరికా దాన్ని సాధించిందన్నారు. వేరే వాళ్లు భయపడుతుంటే.. అమెరికా భయానికే ఎదురు వెళ్తుందన్నారు. వేరే వాళ్లు ధైర్యం గురించి మాట్లాడుతుంటే.. అమెరికా దాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.

ఇరాన్ అత్యంత ప్రమాదకరం..

ఇరాన్ దేశాన్ని అత్యంత ప్రమాదకరమైన దేశంగా ట్రంప్ (Donald Trump) అభివర్ణించారు. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశంగా విమర్శించారు. గత 51 ఏళ్లుగా ఇరాన్ దేశ పాలకులు రక్తసిక్త పాలన, విచ్చలవిడిగా హత్యలు చేస్తూ వస్తున్నారని దుయ్యబట్టారు. ఆ రక్తపాతాన్ని పశ్చిమాసియా మొత్తం రుద్దాలని తెగ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి అలా కుదరదన్నారు. తాను ఎప్పుడైతే రంగంలోకి ప్రవేశించానో.. అప్పుడే ఇరాన్ పని ఖతమైందన్నారు. తానెప్పటికీ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటాన్ని ఒప్పుకోనని తేల్చి చెప్పారు.

Also Read : భారత హాకీ జట్టు గోల్స్ జోరు.. శ్రీలంక బేజారు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>