కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ (Patancheru Police) పరిధిలోని పార్థ రైస్ మిల్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.54,900 నగదుతో పాటు పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారంతా హమాలీలు, కిరాణా షాపుల నిర్వాహకులు, మెకానిక్‌లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

