సీఎం సభతో కేటీఆర్ వెన్నులో వణుకు.. ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

కలం, రాజన్నసిరిసిల్ల: సిరిసిల్లలో ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభతో మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ పతనం ప్రారంభమవుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సభ ప్రకటనతోనే బీఆర్‌ఎస్ నాయకుల్లో ఆందోళన మొదలైందని విమర్శించారు.  మంగళవారం వేములవాడలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సీఎం సభ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

గులాబీ శ్రేణుల్లో అలజడి..

సీఎం రేవంత్ రెడ్డి సభతో (CM Revanth Siricilla Meeting) కేటీఆర్ వెన్నుల్లో వణుకు, గులాబీ శ్రేణుల్లో అలజడి మొదలైందని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ​పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సిరిసిల్ల చేనేత రంగానికి, రాజన్న ఆలయాభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లు రాజన్న సన్నిధికి వచ్చి గతంలో ఇచ్చిన హామీలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చాకే వేములవాడ అభివృద్ధి..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వేములవాడ రాజన్న ఆలయాభివృద్ధికి రూ.250 కోట్లు, గుడికోట సూరమ్మ ప్రాజెక్టు భూసేకరణకు రూ.80 కోట్లు కేటాయించామని ఆది శ్రీనివాస్ తెలిపారు. ​చేనేత కార్మికులకు బకాయిపడ్డ రూ.300 కోట్లను చెల్లించడమే కాకుండా, రూ.49 కోట్ల రుణమాఫీ చేశామని, కోట్లాది మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ధరణి, 22-A భూముల పేరుతో పేదలకు జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ, నివాస గృహాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ​లక్ష మందితో నిర్వహించనున్న ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గ్రామాలు, మండలాల వారీగా ప్రజలను, లబ్ధిదారులను సమీకరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

​ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, సిరిసిల్ల ఇన్ చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గీతేలతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ సభా స్థలిని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>