కలం, నిర్మల్ : ఈ నెల 26న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ (Special Lok Adalat) లో అధిక సంఖ్యలో బ్యాంకు కేసులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. రవీందర్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బ్యాంకు మేనేజర్లతో సమావేశం నిర్వహించారు.
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న బ్యాంకు కేసుల వివరాలను సమీక్షించి, ఇరుపక్షాల సమ్మతితో కేసులను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారంతో సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎల్డీఎం రామ్గోపాల్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

