కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

కలం, దిలావర్‌పూర్: దిలావర్‌పూర్ మండలంలోని కాల్వ (Kalwa) గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ (Lakshmi Narasimha Temple) హుండీ లెక్కింపును మంగళవారం నిర్వహించారు. కదిలి ఆలయ ఈఓ రాజేష్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. అన్ని హుండీలు కలుపుకొని రూ. 5,53,490 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో బాపు రెడ్డి తెలిపారు.

హుండీ లెక్కింపు సందర్భంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ చైర్మన్ అంగూర్ మహేందర్, గ్రామ ఉప సర్పంచ్ హరికృష్ణ, సీనియర్ అసిస్టెంట్ మాధవరావు, మాజీ ధర్మకర్తలు, ఆలయ పూజారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>