కలం, కోరుట్ల: రాబోయే గోదావరి పుష్కరాలు–2027ను పురస్కరించుకుని కోరుట్ల (Korutla) నియోజకవర్గంలో ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం పెద్దపీట వేసింది. నియోజకవర్గ పరిధిలోని 12 పుష్కర ఘాట్ల నిర్మాణ, మరమ్మతు పనులకు సంబంధించి రూ.9.217 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానిక కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ప్రత్యేక చొరవ తీసుకుని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ప్రతిపాదనల ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో (G.O.Rt.No.562, తేదీ: 15-09-2026)లో జగిత్యాల జిల్లా పరిధికి సంబంధించి సీరియల్ సంఖ్య 22 నుండి 33 వరకు ఈ 12 పనులను చేర్చారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు:
ఈ పనులు పూర్తయితే పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు స్నాన ఘాట్ల వద్ద సురక్షితమైన, మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే కార్యాలయం పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత కాలపరిమితిలోగా నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేసేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని అధికారులు వెల్లడించారు.
మంజూరైన పనుల వివరాలు:
ఎర్రదండి: కొత్త ఘాట్ల నిర్మాణం, షవర్లు, టైల్స్, ఇతర వసతులు – రూ.3.30 కోట్లు
వాల్గొండ: కొత్త ఘాట్ల నిర్మాణం, షవర్లు, టైల్స్, మౌలిక వసతులు – రూ.2.28 కోట్లు
వి.వి.రావుపేట: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.80.70 లక్షలు
కోమటి కొండాపూర్: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.50.00 లక్షలు
మొగిలిపేట్: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.49.00 లక్షలు
ఫకీర్‌కొండాపూర్: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.33.00 లక్షలు
బార్తిపూర్: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.31.00 లక్షలు
ఓల్డ్ ధర్మరాజ్‌పల్లి: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.30.00 లక్షలు
వేములకుర్తి: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.25.00 లక్షలు
రత్నాలమడుగు: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.25.00 లక్షలు
న్యూ ధర్మరాజ్‌పల్లి: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.22.00 లక్షలు
ఒబ్బులాపూర్: పుష్కర్ ఘాట్ మరమ్మతులు – రూ.18.00 లక్షలు

