గర్భిణీలు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: కవితా రాణి

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం (Poshan Month Program) ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ రాగుల ప్రదీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్ వైజర్ కవితా రాణి ముఖ్య అతిథిగా హాజరై, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషణ మాసం ప్రాముఖ్యతను వివరించారు.

కిశోర బాలిక దశ నుండే తీసుకోవాల్సిన పౌష్టికాహారం, మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత గురించి వివరించి, పౌష్టికాహారాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చూపించారు. అనంతరం 6 నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి, అందరి చేత పోషణ ప్రతిజ్ఞ చేయించారు.

ఐసీడీఎస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, 3 నుండి 6 ఏళ్ల పిల్లలను ప్రతిరోజూ అంగన్వాడీకి పంపించాలని, పిల్లల ఎత్తు, బరువు తీయడంలో, గర్భిణీలు, బాలింతలు కేంద్రంలో భోజనం చేయడంలో సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మాదేషి శిరీష గర్భిణీలు తీసుకోవాల్సిన టీకాలు, జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పవిత్ర, ఆశా కార్యకర్తలు మంజుల, లావణ్య, ఆయా, గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>