మైనర్ జంటపై దాడి కేసు: ప్రధాన నిందితుడిపై కాల్పులు

కలం, వెబ్ డెస్క్ : బీహార్‌లోని జమూయి జిల్లాలో మైనర్ జంటపై దాడి చేసి, వేధింపులకు గురిచేసిన కేసు (Jamui Minor Harassment)లో పోలీసులు సంచలన చర్యలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు నందన్ యాదవ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతడు తప్పించుకుని పారిపోయేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి కాలిపై కాల్పులు జరిపి కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ సంఘటన సెప్టెంబర్ 19 సాయంత్రం జమూయి పరిధిలో చోటుచేసుకుంది. కోచింగ్ క్లాస్‌కు వెళ్లి వస్తున్న జంటను అడ్డుకున్న కొందరు దుండగులు, బాలిక పట్ల నీచంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా తాకారు. ఈ వేధింపులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో దుమారం రేపింది.

ఘటన పై స్పందించిన జమూయి ఎస్పీ బిశ్వజిత్ దయాళ్, మహిళా అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల శోధన అనంతరం నందన్ యాదవ్ ఆచూకీ లభించగా, అతన్ని అరెస్టు చేసి ఎసం ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>