ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. అత్యంత బాధాకరం: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ హాస్పిటల్ లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో గాయపడిన 23 మంది పసిపిల్లలకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే భారీ ప్రమాదం జరిగి పిల్లలు అన్యాయంగా బలైపోయారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పిల్లల వార్డులు, ఐసీయూలను నిపుణులతో తనిఖీ చేయించాలని.. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డే ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తమ పసిపిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>