ఓయో రూంలో యువతి అనుమానాస్పద మృతి

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మాదాపూర్ సిద్దిక్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓయో హోటల్ (Madhapur OYO) గదిలో విశాఖపట్నంకు చెందిన శారన్ నిఖిత (29) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న ఆమె తన ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి ఈ హోటల్‌లో దిగింది.

అర్ధరాత్రి సమయంలో నిఖిత స్పృహ కోల్పోవడంతో, రవితేజ హోటల్ సిబ్బంది సాయంతో ఆమెను కొత్తగూడలోని అపోలో ఆస్పత్రికి తరలించాడు. అయితే పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న క్లూస్ టీమ్ రంగంలోకి దిగి హోటల్ గదిలో ఆధారాలు సేకరించింది. యువతి ముఖంపై స్వల్ప గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటన అనంతరం ప్రియుడు రవితేజ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు పరారీలో ఉన్న రవితేజ కోసం గాలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>