కలం, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కెవడియా) వేదికగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం (National Film Awards) వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ వెలుపల వేరొక రాష్ట్రంలో ఈ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ కార్యక్రమంలో భారతీయ సినిమాకు విశేష సేవలు అందించిన సినీ దిగ్గజాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ఇతర ముఖ్య అధికారులు ఏక్తా నగర్‌లో ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా విభిన్న భాషలకు చెందిన ప్రముఖ సినీ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు.

