వినాయ‌క మండ‌పంలో ఫుడ్ పాయిజ‌న్‌!

కలం, అచ్చంపేట: వినాయక మండపం వద్ద ప్రసాదం తిని భక్తులు వాంతులు, విరోచనాల‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న ఘ‌ట‌న‌ నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల (Uppununthala) మండలంలోని కాంసాన్పల్లిలో చోటు చేసుకుంది. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సోమవారం గ్రామంలోని ఓ వినాయ‌క మండ‌పం వ‌ద్ద ప్ర‌సాదం పంపిణీ చేశారు. ఈ ప్ర‌సాదం తిన్న భ‌క్తులు, గ్రామ‌స్తులు అస్వస్థకు గుర‌య్యారు. వెంట‌నే అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్ట‌ర్లు ప‌రిశీలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్లు ప‌లువురు గ్రామ‌స్తులు వివరించారు. అయితే ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగానే భ‌క్తుల‌కు వాంతులు, విరోచ‌నాలు అయిన‌ట్లు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>