కలం, స్పోర్ట్స్ : ఏషియన్ గేమ్స్ నుంచి అనూహ్యంగా వైదొలిగిన భారత ఎంఎంఏ ఫైటర్ వరుణ్ సన్యాళ్(Varun Sanyal) తనకు ఎదురైన ఘటనపై స్పందించారు. 77 కేజీల విభాగంలో పోటీ పడాల్సిన వరుణ్.. బరువు తగ్గే క్రమంలో సోనా బాత్‌లో స్పృహతప్పి పడిపోవడంతో వైద్య పరీక్షల అనంతరం పోటీకి అనర్హుడయ్యారు. వరుణ్ జనవరిలోనే ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించినప్పటికీ, ఎంపిక విధానంపై స్పష్టత లేకపోవడంతో ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెట్టారు. అయితే పోటీకి రెండు వారాల ముందు మాత్రమే ఆయనకు పిలుపు వచ్చింది. వసతి, క్రీడా సదుపాయాల సమస్యలతో పాటు మద్దతు సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ఒంటరిగానే బరువు తగ్గే ప్రయత్నం చేశారు.
ఆదివారం క్రూయిజ్ షిప్లో బరువు తగ్గేందుకు సోనా బాత్ ఉపయోగిస్తుండగా వరుణ్ స్పృహతప్పి పడిపోయారు. నేపాల్‌కు చెందిన మరో అథ్లెట్ ఆయనను గుర్తించి స్పృహలోకి తీసుకువచ్చారు. అనంతరం ఎంఎంఏ సమాఖ్య అధ్యక్షుడి సహాయంతో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒంటరిగా బరువు తగ్గే ప్రయత్నం చేయడం తన పొరపాటేనని వరుణ్ (Varun Sanyal) అంగీకరించారు. అయితే పరిస్థితుల కారణంగా తనకు మరో మార్గం లేకపోయిందని తెలిపారు. ఈ ఘటనపై నిరాశ ఉన్నప్పటికీ భారత ఎంఎంఏ జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉందన్నారు. మహిళల 60 కేజీల విభాగంలో సచి కా తరియాల్ కాంస్య పతకం సాధించి, ఈ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించారు.
Also Read : అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా గిన్నిస్ వరల్డ్ రికార్డ్!
Follow Us On : WhatsApp

