గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు : మేయర్ కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్: వినాయక నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా నగరపాలక సంస్థ ద్వారా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas ) అన్నారు. కరీంనగర్ లో జరగనున్న గణేష్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, నగరపాలక సంస్థ, పోలీస్ అధికారులతో కలిసి నిమజ్జనం పాయింట్లను సందర్శించారు. కొత్తపల్లి మానకొండూర్ చెరువులు, చింతకుంట కెనాల్ నిమజ్జనం పాయింట్ల వద్ద చేస్తున్న ఏర్పాట్లను తనిఖీ చేసి పరిశీలించారు.

నిమజ్జనం ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేలా అధికారులకు, సిబ్బందికి మేయర్ సూచనలు చేశారు. ప్రధానంగా కొత్తపల్లి నూతన పాయింట్ వద్ద ఏర్పాట్లలో లోటు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ​ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వం సిద్ధం చేస్తోందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

నిమజ్జనం జరిగే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేయర్ సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా నగరపాలక సంస్థ ద్వారా అన్ని నిమజ్జనం పాయింట్లలో చక్కటి లైటింగ్ ఏర్పాటు చేసి.. తాగు నీటి సౌకర్యం, ప్రత్యేక పారిశుధ్యం చేపట్టాలన్నారు. లైటింగ్ విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

నిమజ్జనం పాయింట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి.. సరైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జనం జరిగే చెరువులు, కెనాల్ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా బారీకేడ్లు ఏర్పాటు చేయాలని కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. నిపుణులైన ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ముందస్తుగా పాయింట్ల వద్ద క్రేన్ల ను ఏర్పాటు చేయాలని… విగ్రహాల పరిమాణానికి తగినట్లుగా భారీ క్రేన్లను సిద్దం చేయాలన్నారు.

అనుభవజ్ఞులైన ఆపరేటర్లు, డ్రైవర్ల ద్వారా విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని మేయర్ సూచించారు. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు.

వచ్చే భక్తులకు ప్రధానంగా త్రాగు నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని.. పారిశుధ్య పనులు మెరుగ్గా చేయాలని మేయర్ ఆదేశించారు. వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులందరూ ఉత్సవ కమిటీలకు, అధికారులకు సహకరించి గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అధికారులు, పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>