కలం, హన్మకొండ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (Warangal Super Specialty Hospital) భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తూ (Christina Z Chongthu) సోమవారం హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆమెకు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాన్ని సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భవన నిర్మాణ పనుల పురోగతి, పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Also Read : నీళ్ల కోసం అదనపు కలెక్టర్ కాళ్లపై పడి వేడుకోలు
Follow Us On : WhatsApp

