పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే రోహిత్ రావు

కలం, మెదక్ బ్యూరో: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (Mynampally Rohit) అన్నారు. మెదక్ నియోజకవర్గంలో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామన్నారు. మెదక్ నియోజకవర్గంలో సోమవారం చిన్న శంకరంపేట మండలంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు.

ఈ సందర్భంగా రోహిత్ రావు మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఆహార భద్రతతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడే ముఖ్యమైన పత్రంగా ఆయన వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>