ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర చిరస్మరణీయం: మంత్రి సీతక్క

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ వేత్త, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ మీద వున్న ఆయన విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క) (Minister Seethakka) నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరంలో పాల్గొని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ, అనంతరం తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడారని గుర్తు చేశారు.

తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని మంత్రి సీతక్క అన్నారు. పదవులు, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ఆయన ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి సీతక్క అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క తో పాటు కూడా చైర్మన్ గుండు సుధారాణి, ఇతర పెద్దలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>