జూరాల నీటి ఎద్దడికి బీఆర్ఎస్ నిర్లక్ష్యమే కారణం: మంత్రి జూపల్లి ఫైర్

కలం, మహబూబ్ నగర్ : జూరాల నీటి ఎద్దడికి గత BRS ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో జూరాల ప్రాజెక్టుపై ఆయన మీడియాతో మాట్లాడారు. జూరాల ఆయకట్టుకు నీటి ఎద్దటి ఉన్నది వాస్తవమేనన్న మంత్రి.. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్క నీరు రావట్లేదని స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆందోళన పై మంత్రి మండిపడ్డారు.

పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క రిజర్వాయర్ నిర్మించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గట్టు ఎత్తిపోతల పథకం పేరుతో 21 TMC ప్రాజెక్టు కడతామని చెప్పి ఒక్క టీఎంసీ కూడా నిర్మించలేదన్నారు. ఆ రోజు కేసీఆర్ సర్కార్ రిజర్వాయర్ నిర్మించి ఉంటే నేడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. అంతేకాదు బీఆర్‌ఎస్ హయాంలో మిషన్ భగీరథ నిర్వహణ నిధులు కూడా ఇవ్వలేదని, విద్యుత్ బిల్లులు సైతం చెల్లించలేదని మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో విద్యుత్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగుకు నీరు వదిలేస్తే వచ్చే ఎండాకాలంలో తాగునీటి పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ పార్టీని నిలదీశారు. అయినప్పటికీ నీటి విడుదల కోసం ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>