సర్వే నంబర్ 325పై అధికారుల ఫోకస్.. ఎర్రవల్లిలో కొనసాగుతున్న సర్వే!

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా ఎర్రవల్లి (Erravalli) గ్రామంలోని సర్వే నంబర్ 325లోని రైతుల భూముల సమగ్ర సర్వే (Land Survey) సోమవారం ప్రారంభమైంది. సర్వే శాఖ AD సుదర్శన్ రాథోడ్, DI శేవ్యా నాయక్‌ల ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ఈ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు అధికారుల బృందాలు సర్వే కోసం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, సంబంధిత రైతులకు అధికారులు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు.

ఈ రోజు రైతుల సమక్షంలో క్షేత్రస్థాయిలో పక్కాగా హద్దులు నిర్ధారించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ సందర్భంగా రైతులు తమ పొలాల వద్దకు చేరుకుని, గతంలో ప్రభుత్వం అందజేసిన పాత పట్టా పాస్ పుస్తకాలు, ఇతర ఆధారాలను అధికారులకు చూపించారు. తాము ప్రస్తుతం సాగు చేసుకుంటున్న భూముల సరిహద్దుల వివరాలను అధికారులకు క్షుణ్ణంగా వివరించి, చూపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ భూముల వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. సమగ్రంగా సాగుతున్న ఈ సర్వే ద్వారా భూ వివాదాలకు పరిష్కారం లభించడమే కాకుండా, రైతుల హద్దుల సమస్యలు తొలగిపోతాయని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>