ఇండియా చేతిలో ఇండోనేషియా చిత్తు

కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ (Asian Games) పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనవిజయంతో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన పూల్ మ్యాచ్‌లో ఇండోనేషియాను 13-1 తేడాతో భారత్ చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఏకంగా 51 సార్లు ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకెళ్లి ఇండోనేషియా డిఫెన్స్‌ను దెబ్బతీసింది. రాజేందర్ సింగ్ కీలక అసిస్ట్‌లతో మెరవగా, దిల్‌ప్రీత్ సింగ్ ఏకంగా నాలుగు గోల్స్ చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

ఆరో నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ వేసిన పెనాల్టీ కార్నర్‌ను షీలానంద్ లక్రా గోల్‌గా మార్చి భారత్‌కు తొలి పాయింట్ అందించాడు. 12వ నిమిషంలో అభిషేక్, 18, 19 నిమిషాల్లో దిల్‌ప్రీత్ వరుస గోల్స్ చేశారు. ఆ తర్వాత రాజేందర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ చెరో గోల్ సాధించారు. పెనాల్టీ స్ట్రోక్ మిస్సయినా, 28వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఇండోనేషియా ప్లేయర్ ఆలియా అల్-ఆర్ధ్ 33వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా తమ జట్టుకు ఏకైక గోల్ అందించాడు.

ఆ తర్వాత కూడా భారత్ ఉధృతి తగ్గలేదు. షీలానంద్ లక్రా, సుఖ్‌జీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్ వరుసగా గోల్స్ సాధించారు. చివరిగా 49వ నిమిషంలో దిల్‌ప్రీత్ తన నాలుగో గోల్ పూర్తి చేయడంతో భారత్ 13-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయంతో లీగ్ దశలో భారత్ ముందంజ వేసింది. క్రెగ్ ఫుల్టన్ శిక్షణలోని భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో తలపడనుంది. ఆ తర్వాత కొరియా, జపాన్, బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>