కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం (Kothagudem) పట్టణంలోని హెడ్ ఆఫీస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాల లోడుతో వేగంగా వెళ్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి రహదారి పక్కకు బోల్తా పడింది.
ఈ ప్రమాద ధాటికి వ్యాన్‌లో ఉన్న పాల ప్యాకెట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో వాహనం బోల్తా పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్‌లను స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌లకు కేవలం స్వల్ప గాయాల మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

