భైంసాలో తపస్ సభ్యత్వ అభియాన్.. ఉపాధ్యాయులకు పిలుపు

కలం, భైంసా: జాతీయవాద భావనను పెంపొందించడంతో పాటు ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంను సభ్యత్వం ద్వారా మరింత బలోపేతం చేయాలని సంఘం నాయకులు కోరారు. శనివారం భైంసా, ముథోల్, తానూర్ మండలాల్లో తపస్ సభ్యత్వ అభియాన్‌ను(TPUS Membership Drive) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శశిరాజ్, సుదర్శన్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్నత విలువలు, జాతీయ భావాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ఉపాధ్యాయులకు న్యాయపరంగా రావాల్సిన హక్కుల సాధనతో పాటు వారి సంక్షేమం కోసం తపస్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు రాజేశ్వర్, జిల్లా బాధ్యులు ధీరజ్, అజయ్, రాజశేఖర్, ఆర్. రాజేశ్వర్, రఘునాథ్, పండరి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>