డిండి ప్రాజెక్టు వివాదంపై సీఎం స్పందించాలి: హనీఫ్​ అహ్మద్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించింది పాలమూరు – రంగారెడ్డి జిల్లాల సాగునీటి కోసమే తప్ప నల్గొండ కోసం కాదని సామాజిక వేత్త, తెలంగాణ ఉద్యమకారుడు హనీఫ్ అహ్మద్ (Hanif Ahmed) తెలిపారు. శనివారం ఆయన మహబూబ్‌‌నగర్‌ (Mahabubnagar) లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు పూర్తికాక, మన నీళ్ల వాటా తేలకముందే డిండి పథకం తెచ్చి మన రైతుల భూములను ముంచుతూ, హక్కులను కాలరాస్తూ నల్గొండకు నీళ్లు తరలిస్తున్నారని మండిపడ్డారు.

నల్గొండకు ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ, నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు తీసుకెళ్లే అవకాశమున్నా పాలమూరు రైతులను కాదని ఇక్కడి నీళ్లను తరలించడం అన్యాయమన్నారు. ఈ డిండి పథకాన్ని తక్షణమే రద్దు చేయించడమే మన అందరి ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

సీఎం వెంటనే స్పందించాలి: హనీఫ్​ అహ్మద్

ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పాలమూరు నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నాగార్జున సాగర్, ఎస్ఎల్‌‌బీసీ ద్వారా నీళ్లను తీసుకెళ్లేలా నల్గొండ నేతలను ఒప్పించి ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.

గత ప్రభుత్వం ఫామ్‌హౌస్‌లో దోపిడీ, కుటుంబ పాలన, ప్రజలపై అణచివేతపై పెట్టిన శ్రద్ధలో పదోవంతు కూడా పాలమూరుకు సాగునీరు అందించడంలో పెట్టలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా కార్పొరేట్ నమూనాలకే ప్రాధాన్యమిస్తూ రైతుల భూములు తీసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పాలమూరు- రంగారెడ్డి పనులకు బడ్జెట్ కేటాయించకపోవడంపై నిలదీశారు. ప్రజాప్రతినిధుల మౌనం నిర్లక్ష్యం వల్లే జిల్లాకు సాగునీరు దక్కడం లేదని, చివరికి కాలువల పనులు కూడా పూర్తి చేయడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకొచ్చి డిండి పనులను వెంటనే ఆపించాలని ఆయన కోరారు.

గతంలో శ్రీశైలం ప్రాజెక్టుతో మన ఊళ్లు మునిగిపోగా ఇప్పుడు డిండి పనుల వల్ల భూములు పోతాయనే ఆందోళనతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఊరూరా సాగునీటి సాధన కమిటీలుగా ఏర్పడి డిండి రద్దు, పాలమూరు – రంగారెడ్డి పూర్తయ్యేంత వరకు అందరం కలసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>