కలం, వరంగల్ బ్యూరో: జీవో నెం.97ను వ్యతిరేకిస్తూ స్టేషన్ ఘన్పూర్ (Station Ghanpur)లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టిన నిరసన 34వ రోజుకు చేరుకుంది. జీవోను వెంటనే ఉపసంహరించుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 34 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదువుకోవాల్సిన సమయంలో పిల్లలు నిరసనల్లో పాల్గొనాల్సి వస్తోందని, జీవో రద్దుపై కొనసాగుతున్న జాప్యం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందేమోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవోపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవల్ కమిటీ చర్చలను త్వరగా పూర్తి చేయాలని జేఏసీ కోరింది. విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది.

