కలం, జోగులాంబ గద్వాల: గట్టు మండలం ఇందువాసి గ్రామ (Induvasi Village) పంచాయతీ కార్యదర్శి గొల్ల శేఖర్‌ను శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్ సస్పెండ్ చేశారు. నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. డీపీవో విచారణలో పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది. అంతేగాకుండా సర్పంచి లేని సమయంలో గ్రామ సభ తీర్మానాలు లేకుండానే నిధులు డ్రా చేయడంతో పాటు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డీపీవో నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు ఎంపీవో సయ్యద్ బాసిత్ తెలిపారు.

