ఎంజీయూ పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

కలం, ఎంజీయూ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ తో పాటు, 1, 2, 3వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ (MG University) రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి గురువారం అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారి (సీఓఈ) డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 1,265 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 967 మంది (76.44%) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల బ్యాక్‌లాగ్ ఫలితాల వివరాలను సీఓఈ వెల్లడించారు. మొదటి సెమిస్టర్‌కు సంబంధించి 427 మంది విద్యార్థులకు గాను 158 మంది (37%) ఉత్తీర్ణులయ్యారు. రెండవ సెమిస్టర్‌కు సంబంధించి 382 మంది విద్యార్థులకు గాను 65 మంది (17.02%) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మూడవ సెమిస్టర్‌కు సంబంధించి 344 మందికి గాను 168 మంది (48.84%) విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.

పరీక్షల పూర్తి వివరాలు, మార్కుల జాబితాను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను పరిశీలించుకోవచ్చని అధికారులు సూచించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో పరీక్షల విభాగ అధికారులు డాక్టర్ డి. సంధ్యారాణి, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>