చెనుగోనిపల్లిలో అగ్ని ప్రమాదం

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల మండలం చెనుగోనిపల్లి (Chenugonipalli)లో అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం మధ్యాహ్నం పెద్ద చెరువు సమీపంలోని విద్యుత్తు స్తంభంపై నిప్పులు చెలరేగి వైర్లు తెగి తెగి పడి మంటలు వ్యాపించాయి.‌ స్థానిక‌ రైతులు వెంటనే అగ్నిమాపక‌ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజిన్‌తో వేగంగా మంటలు ఆర్పారు. పెద్ద చెరువు‌ చుట్టూ ఉన్న చెట్లు‌‌ పూర్తిగా కాలిపోయాయి. అయితే. గద్వాల సబ్ స్టేషన్ నుంచి గ్రామాలకు విద్యుత్తు సరఫరా అవుతోందని, లోడ్ ఎక్కువ కావడంతో జంపర్‌ వద్ద మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : 7,437 పోలీస్ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ఖరారు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>