కలం, వెబ్ డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుటుంబం వందలాది ఎకరాల భూములను కబ్జా చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వివరాలు వెల్లడించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ (TG Congress) కీలక నిర్ణయం తీసుకుంది. కల్వకుంట్ల కుటుంబ భూముల వ్యవహారంపై క్షేత్రస్థాయిలోనే తేల్చుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం సిద్ధిపేటలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించింది.
ప్రజాప్రతినిధులు శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వద్దకు చేరుకోవాలని సూచించింది. సీఎల్పీ (CLP) పాయింట్ నుంచి కాంగ్రెస్ నేతలందరినీ సిద్ధిపేటకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సును సిద్ధం ఏర్పాటు చేశారు. సిద్ధిపేట రెవెన్యూ కార్యాలయానికి వెళ్లనున్న కాంగ్రెస్ నేతల బృందం, కేసీఆర్ కుటుంబ భూములకు సంబంధించిన రికార్డులు, పహాణీలు, భూ కేటాయింపు పత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అసెంబ్లీలో సీఎం వెల్లడించిన భూముల లెక్కల ఆధారంగా సిద్ధిపేట రెవెన్యూ ఆఫీస్‌లో రికార్డులు తనిఖీ చేయాలని కాంగ్రెస్ (TG Congress) నిర్ణయించడంతో రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది.
Also Read : మోదీ పుట్టిన రోజు.. కొత్త మంత్రం చెప్పిన చంద్రబాబు
Follow Us On : WhatsApp

