మోదీ పుట్టిన రోజు.. కొత్త మంత్రం చెప్పిన చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా వారణాసిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు (CM Chandrababu) అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. ‘వి.కె.ఎస్ మంత్ర’ను ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు. వి అంటే వాద్ నగర్, కె అంటే కాశీ, ఎస్ అంటే సెప్టెంబర్ 17 అన్నారు. వాద్ నగర్‌లో సెప్టెంబర్ 17న జన్మించిన మోదీ కాశీ నుంచే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివరించారు. పాజిటివ్‌గా జీవితంలో ముందుకు వెళితే.. ఎలాంటి స్థానానికైనా చేరుకోవచ్చని మోదీ నిరూపించారన్నారు. ఇదే స్ఫూర్తి దేశమంతటా వ్యాపించాలని, మోదీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు.

మోదీ కారణంగానే సాధ్యం..

20 ఏళ్ల కిందట వామపక్ష తీవ్రవాదానికి చాలా ఎక్కువగా ఉండేదని సీఎం చంద్రబాబు అన్నారు. అలిపిరిలో తనపై మావోయిస్టులు జరిపిన బాంబు దాడిని గుర్తు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని.. మోదీ కారణంగానే అది సాధ్యమైందన్నారు. శత్రువులు ఎవరైనా ఇండియాపై దాడికి దిగితే.. ప్రతి దాడి ఏ స్థాయిలో ఉంటుందో ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. ఇది ‘సరికొత్త భారత్, ఆత్మనిర్భర భారత్’ అని అన్నారు. వారణాసి గతంతో పోలిస్తే ఎంతో మారిపోయిందని.. మోదీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటమే అందుకు కారణమన్నారు. మహా కుంభమేళాను కూడా అద్భుతంగా నిర్వహించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>