కలం, వనపర్తి: సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా కాకుండా విలీన దినోత్సవంగా జరుపుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా వనపర్తి (Wanaparthy) బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనమైందని, జాతీయ సమైక్యత, సమగ్రత కోసం జరిగిన ఈ చారిత్రక పరిణామాన్ని విలీన దినోత్సవంగా జరుపుకోవాలని పునరుద్ఘాటించారు.
ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం, సమైక్యత కోసం నాటి సాయుధ పోరాటంలో ఎందరో అమరులయ్యారని తెలిపారు. అందుకే బీఆర్‌ఎస్ (BRS) సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా భావిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో శాశ్వత శత్రువుగా నిలిచిపోయిందని నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. ఆ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలు, సాగునీటి కొరత, యూరియా కొరత, సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లతో రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్‌గౌడ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, వనం రాములు, దిలీప్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, వెంకటస్వామి, శివరామ్‌రెడ్డి, ఉంగ్లం తిరుమల్, చంద్రశేఖర్‌నాయక్, జాతృ నాయక్, దేవర్ల నరసింహ, కౌన్సిలర్లు భారతి, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, మురళీసాగర్, స్వాతి హరిబాబు, శిరీష, రమేష్‌గౌడ్, పలుస శంకర్‌గౌడ్, గులాం ఖాదర్‌ఖాన్, జోహెబ్‌హుస్సేన్, చిట్యాల రాము, మంద రాము, మహిళా నాయకులు నాగమ్మ, కవితా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : భూ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఎర్రబెల్లి
Follow Us On : WhatsApp

