ర‌ణ‌బాలి షూటింగ్ కంప్లీట్‌.. రిలీజ్ డేట్ ఇదే!

క‌లం, వెబ్‌డెస్క్: స్టార్ క‌పుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) జంట‌గా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ర‌ణ‌బాలి (Ranabaali) షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విష‌యాన్ని మూవీ టీం గురువారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. స‌రిగ్గా 29 రోజుల‌కు థియేట‌ర్ల‌లో క‌లుసుకుందాం అంటూ స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. రానున్న ద‌స‌రా పండుగ‌ సంద‌ర్భంగా అక్టోబర్ 16న ర‌ణ‌బాలి వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ యోధుడిగా రణబాలి పాత్రలో నటిస్తుండగా, ఆయన భార్య‌ జయమ్మ పాత్రలో రష్మిక మందన్న కనిపించనున్నారు.

రియల్ లైఫ్ మ్యారేజ్‌ తర్వాత ఈ క్రేజీ క‌పుల్‌ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ప‌వ‌న్ బాసంసెట్టి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న‌ ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అజ‌య్‌-అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన ఏంద‌య్య సామి పాట సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఫుల్ మూవీ కోసం ర‌ష్మిక్, విజ‌య్ ఫ్యాన్స్ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>