కలం, నిర్మల్ : ఉమ్మడి జిల్లాలో తొలి అయ్యప్ప ఆలయంగా పేరుగాంచిన సోన్ మండలం కడ్తాల్ శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప ఆలయం (Kadthal Ayyappa Temple) లో బుధవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యోదయ వేళ తొలి లేలేత కిరణాలు ఆలయంలోని అయ్యప్పస్వామి పాదాలను నేరుగా తాకడంతో భక్తులు ఆ దృశ్యాన్ని కనులారా వీక్షించి పరవశించిపోయారు. స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు పడిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ఆలయానికి వచ్చిన భక్తులు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు. సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకిన సమయంలో ఆలయ (Kadthal Ayyappa Temple) ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది. మామూలు రోజుల్లో ఈ విధంగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకే దృశ్యం కనిపించదని వినాయకచవితి, దసరా, ఉగాది వంటి పర్వదినాల సమయంలో మాత్రమే ప్రత్యేకంగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతుంటాయని ఆలయ గురుస్వామి నర్సారెడ్డి తెలిపారు.
Also Read : ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం కీలక భేటీ
Follow Us On: Instagram

