కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌజ్ పై విచారణకు ఆదేశించారు. ఫామ్ హౌజ్ భూములపై ఎంక్వైరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరపకపోతే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అలాగే, ఫామ్ హౌజ్ భూముల(KCR Farmhouse Lands)పై 30 రోజుల్లో నివేదిక అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే కేసీఆర్ వేల కోట్ల రూపాయలు, వందలాది ఎకరాలు ఎలా సంపాదించారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కానీ, ఉద్యమకారులు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి ద్వారా కేసీఆర్ కుటుంబం వందల ఎకరాలు దోచుకుందని ధ్వజమెత్తారు.
కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాల్లో 440 ఎకరాల భూమి ఉందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి ఏయే జిల్లాల్లో ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చదివి వినిపించారు. ఫామ్ హౌజ్ పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని.. ఆ భూములను పేద ప్రజలకు పంచుతానని ముఖ్యమంత్రి ప్రకటించారు.
Also Read : వైభవ్‌తో పోటీపై సంజూ షాకింగ్ కామెంట్స్!
Follow Us On: X(Twitter)

