బొమ్మా బొరుసు జూదం ఆడుతున్న ఏడుగురు అరెస్ట్!

క‌లం, మెద‌క్ బ్యూరో: మెద‌క్ (Medak Police) జిల్లా వెల్దుర్తి మండలం హక్కింపేట గ్రామ పరిధిలోని హక్కింపేట డ్యామ్ సమీపంలో బొమ్మా బొరుసు జూదం ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు.

మెద‌క్ జిల్లాలో జూదం, బొమ్మా బొరుసు, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. జూదం వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవిరుద్ధ జూదం, బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>