కలం, స్పోర్ట్స్ : జింబాబ్వే వెటరన్ బ్రెండన్ టేలర్ (Brendan Taylor) సంచలనం సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్ రికార్డును తన పేరుపై రాసుకున్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం హరారేలో జరిగిన తొలి వన్డేలో టేలర్ బరిలోకి దిగాడు. దీంతో అతని ఓడీఐ కెరీర్ 22 ఏళ్ల 4 నెలలకు చేరింది. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ ఓడీఐ కెరీర్ 22 ఏళ్ల 3 నెలలు కొనసాగింది. 2012లో ఆయన వన్డేలకు వీడ్కోలు పలికారు.
అయితే వన్డేల్లో సచిన్ ఆధిపత్యం మాత్రం కొనసాగుతోంది. అత్యధిక పరుగులు 18,426. అత్యధిక మ్యాచ్‌ల రికార్డు 463 కూడా సచిన్‌దే. 40 ఏళ్ల బ్రెండన్ టేలర్ 2004లో వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు జింబాబ్వే తరఫున 207 ఓడీఐలు ఆడాడు. 11 సెంచరీలు చేశాడు. ఇవి జింబాబ్వే తరఫున అత్యధిక వన్డే సెంచరీలు. 2021లో టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో ఐసీసీ అవినీతి నిరోధక, యాంటీ డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మూడున్నరేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు.
నిషేధం పూర్తైన తర్వాత 2025లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు జింబాబ్వే సిద్ధమవుతున్న సమయంలో అతని రీఎంట్రీ జరిగింది. ఇక ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 2014 తర్వాత జింబాబ్వేలో ఆస్ట్రేలియా ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇది. ఆ 2014 మ్యాచ్‌లో జింబాబ్వే విజయంలో ఆడిన ముగ్గురు ఆటగాళ్లలో మిచెల్ మార్ష్, సికందర్ రజా, బ్రెండన్ టేలర్ (Brendan Taylor) ఉన్నారు.
Also Read : UPI యూజర్స్‌కి బిగ్ అలర్ట్.. కొత్త నిబంధనలు అమలు..!
Follow Us On : WhatsApp

