సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ కొరడా

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ (Nirmal Municipality) అధికారులు కొరడా ఝళిపించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని ప్లాస్టిక్, కిరాణా దుకాణాల్లో మున్సిపల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తున్న దుకాణదారులకు రూ.9,500 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ (Nirmal Municipality) కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (Single Use Plastic) వినియోగాన్ని పూర్తిగా విరమించుకోవాలని దుకాణదారులకు సూచించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులను వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రజిని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>