హామీలు విస్మరించిన కాంగ్రెస్.. గిరిజనులకు అన్యాయం: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో మోసం చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గిరిజనులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మాట తప్పిందని చెప్పారు.

ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్.. కాంట్రాక్టులలో 12 శాతం గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టి మాట తప్పిందని అన్నారు. గిరిజన విద్యార్థుల విద్య జ్యోతి పథకం ద్వారా చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు.

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 10% రిజర్వేషన్ లు ఇవ్వడం జరిగిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించామని, తద్వారా సుమారు 30 వేల మంది గిరిజనులు ప్రజాప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించడం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గిరిజనుల కోసం సుమారు రూ.100 కోట్ల ఆస్తులు, రూ.25 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తండాల్లో జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని… గురుకులాలు, వసతి గృహాల్లో నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడు సంవత్సరాలు గడుస్తున్నా గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమని, రాజకీయంగా కూడా గిరిజనులకు తగిన అవకాశాలు కల్పించడం లేదన్నారు.

గిరిజన కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) కోరారు. కేసీఆర్ సర్కార్ హయాంలో గిరిజన విద్యార్థులు, వర్కింగ్ మహిళల కోసం రూ. 4 కోట్లతో అన్ని వసతులతో భవన నిర్మాణం పూర్తి చేశామని, గిరిజన యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు వనగట్టు వద్ద ప్రత్యేక శిక్షణ కేంద్రం రూ 2.75 కోట్లతో ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. హన్వాడ మండలం దాచకపల్లి గ్రామంలో 36 చెంచుల కుటుంబాలు 76 యేండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న పట్టాలకు నోచుకోలేదని, 15 ఎకరాల 9 గుంటల పోడు భూమి ఉంటె అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు.

అనంతరం ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యా నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పి గిరిజనులను మోసం చేసిందని, గిరిజన బిడ్డల విదేశీ విద్యకు కేసీఆర్ ప్రభుత్వం సహకారం అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ ప్రతాప్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ హన్వాడ ఎస్టి సెల్ అధ్యక్షులు హరిచందర్, కార్పొరేటర్ రమేష్ నాయక్, సీనియర్ నాయకులు రమేష్ నాయక్, రవీందర్ నాయక్, పూర్య నాయక్, సురేష్ నాయక్, మోహన్ నాయక్, రవి నాయక్. అంబు నాయక్, నెహ్రు నాయక్, రాజేష్ నాయక్, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : యూరియా కోసం ఫోన్.. రైతుపై అధికారి బూతుల ఆడియో వైరల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>