కలం, సారంగాపూర్ : సొంతింటి కల సాకారం దిశగా ధని గ్రామంలో (Dhani Village) ఐదుగురు లబ్ధిదారులు మరో అడుగు ముందుకేశారు. సారంగాపూర్ (Sarangapur) మండలం ధని గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ జెట్టవేణి బడిపోతన్న ఆధ్వర్యంలో ఐదుగురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు ముహూర్తం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసుకునేలా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆరె నారాయణ, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

