కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రెండు సార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్(KCR)పై దాడి చేసేందుకు కాంగ్రెస్ నేతలు పక్కా స్కెచ్ వేశారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఆయన ఇంటిని వేలాది మంది చుట్టుముట్టారని తెలిపారు. దాన్ని అడ్డుకోవాలని వెళితే తమను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని విమర్శించారు. అక్కడ కూడా తమపై దాడి చేశారని స్పష్టం చేశారు.
కోర్టుకు వెళ్తాం..
సోమవారం తన సిబ్బందిపై సాక్షాత్తూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లోనే దాడికి యత్నించారని తెలిపారు. కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. అందుకే, పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైనవారిపై దాడి జరుగుతుంటే చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తమ నేతలు స్టేషన్లో 5 గంటల పాటు నిరీక్షించినా ఫలితం లేదన్నారు. దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు.
Also Read : రూ.3,383 కోట్ల ఆస్తులు.. వీధుల్లో బిచ్చగాడిగా బీజేపీ ఎమ్మెల్యే!
Follow Us On: X(Twitter)

