కలం, వెబ్ డెస్క్: హనుమకొండ (Hanumkonda) లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పబ్లిక్ గార్డెన్ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై భారీ వృక్షం నేలకూలి పడింది. ఈ ప్రమాదంలో బస్సుతో పాటు అక్కడ ఉన్న రెండు బైకులు, మూడు ఆటోలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.
చెట్టు పడటంతో బస్సులోని ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురయినప్పటికీ, అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : రూ.3,383 కోట్ల ఆస్తులు.. వీధుల్లో బిచ్చగాడిగా బీజేపీ ఎమ్మెల్యే!
Follow Us On: X(Twitter)

