పోలీస్ స్టేషన్‌లోనే దాడి.. కేటీఆర్ సంచలన ట్వీట్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుంపు దాడులు కేవలం హత్యలతోనే ప్రారంభం కావని, పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లోనే యూనిఫాం ధరించిన అధికారుల ముందే పథకం ప్రకారం జరిగే దాడులతో కూడా మొదలవుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగమే గుండాగిరిని ప్రోత్సహిస్తోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే వీధుల్లో మనుషులపై దాడులు చూసే ప్రమాదం ఉందంటూ ఆమన పేర్కొన్నారు.

తన పీఆర్ మహేష్ మణిక్యాల, పీఏ మహేందర్ రెడ్డిలపై పోలీస్ స్టేషన్ లోపలే దాడి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. అణచివేతకు లొంగని ఏ తెలంగాణ పౌరుడికైనా రేపు ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రస్తుతం అరాచకత్వ అంచున నిలిచిందని, కాంగ్రెస్ పాలనలోనే ఇది సాధ్యమైందని, వెల్ డన్ కాంగ్రెస్ అంటూ.. రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>