భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు

కలం, వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఢిల్లీ చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ పర్యటనకు వచ్చారు. తెల్లవారుజామున ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పుతిన్‌కు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి పుతిన్ భారీ భద్రత నడుమ హోటల్‌కు వెళ్లిపోయారు. సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరపబోతున్నారు.

11వ సారి భారత్ పర్యటనకు..

రష్యా అధ్యక్షుడి హోదాలో పుతిన్ భారత్ రావడం ఇది 11వ సారి. గత 26 ఏళ్లల్లో వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్, మోదీ ప్రధానులుగా ఉన్న సమయాల్లో పుతిన్ భారత్ పర్యటనలు చేపడుతూనే ఉన్నారు. మోదీ ప్రధాని అయ్యాక.. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత వ్యూహాత్మకంగా మారాయి. ఇటీవలే బిష్కెక్ సదస్సులో పాల్గొన్న మోదీ, పుతిన్.. నెల రోజులు కాకముందే మరోసారి భేటీ కావడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>