కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఈ రోజు జాతీయ మహిళా కమిషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అసెంబ్లీ వద్ద తమపై పోలీసులు జరిపిన దాడిపై ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్‌కు ఫిర్యాదు చేయబోతున్నారు. గురువారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్న ఎమ్మెల్యేలు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు కమిషన్‌తో భేటీ కాబోతున్నారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ వాణి శ్రీదేవి కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు.
మానవ హక్కుల కమిషన్‌లో..
అసెంబ్లీ గేటు వద్ద జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయబోతున్నారు. పోలీసులు తమను అడ్డుకోవడమే కాకుండా.. దూషించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా.. తమ హక్కులకు భంగం కలిగించారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కమిషన్‌కు సమర్పిస్తామని చెప్పారు.

