కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభ (Telangana Assembly) సమావేశాలు నేడు 5వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ముఖ్యమంత్రి స్వయంగా ‘కోర్ అర్బన్ రీజియన్ బిల్లు’ తో పాటు ‘మున్సిపాలిటీల 4వ సవరణ బిల్లు’ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ‘ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లు’ను అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు. బిల్లుల ప్రవేశంతో పాటు నేటి సభలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలపై స్వల్పకాలిక చర్చలు కూడా జరగనున్నాయి. ప్రధానంగా జనాభా గణనలో బీసీ, ఓబీసీల అంశంపైన, అలాగే రాష్ట్రంలోని విద్యారంగ కార్యక్రమాలు, సంస్కరణలపైన ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్చించనున్నారు.

