కలం, నిజామాబాద్ బ్యూరో : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లులు (Nizamabad Rice Mills) మూతపడ్డాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొన్నాళ్లుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ (Rice Millers Association) ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1969 నుంచి ఉన్న నిబంధన ప్రకారం క్వింటాల్ కు 67.1 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉందని, కాని మారిన పరిస్థితుల కారణంగా దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన చట్టం ప్రకారం బియ్యం సరఫరా సాధ్యం కావడం లేదన్నారు. అలాగే రైతుల తెచ్చిన ధాన్యంలో 15 శాతం నుంచి 20 శాతం వరకు డ్యామేజీ భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే 2014 నుంచి నిజామాబాద్ జిల్లాలోని అనేక రైస్ మిల్లులకు (Nizamabad Rice Millers) కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో (Bills pending) ఉన్నాయని అన్నారు. దీంతో మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు ప్రభుత్వం అడుగుతున్న బియ్యం సరఫరా చేయడం కూడా సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయపై అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించాలని కోరారు. లేనిపక్షంలో బంద్‌ను కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు.
Also Read : ఫామ్‌హౌస్ నుంచే అసెంబ్లీ కుట్ర: రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Follow Us On : WhatsApp

